ఉల్లిపాయ మసాలా కూర - రుచుల ఉల్లి... పోషకాల తల్లి

ఉల్లిపాయ మసాలా కూర - రుచుల ఉల్లి... పోషకాల తల్లి


రుచుల ఉల్లి... పోషకాల తల్లి


కోస్తే కన్నీరు పెట్టిస్తుందన్నమాటే కానీ... చద్దన్నంలో పడితే అమోఘమైన చలువ చేస్తుంది... దోసెల్లోకి పచ్చడి చేస్తే కళ్లకు అద్దుకుని తినాల్సిందే! అంతెందుకు ఉత్తి ఉల్లిపులుసు పెట్టినా లొట్టలేయాల్సిందే! వేసవికాలం పోషకాలపరంగా ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదు..●
* దీంట్లోని విటమిన్‌-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడే కొల్లాజన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ●

* పచ్చి ఉల్లిపాయ చెడు కొవ్వును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

* దీంట్లో ఉండే క్రోమియం రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.

* ఉల్లిరసంలో కాస్త తేనె కలిపి తీసుకుంటే జలుబు, అలెర్జీలు తగ్గుతాయంటారు.

* ఉల్లిపాయలో ఉండే ఫోలేట్‌ నిద్రపట్టేలా, ఆకలి వేసేలా చేస్తుంది. కుంగుబాటు తగ్గడానికీ తోడ్పడుతుంది.

 ఉల్లిపాయ మసాలా కూర - రుచుల ఉల్లి... పోషకాల తల్లి


 ఉల్లిపాయ మసాలా కూర


కావాల్సినవి:  

ఉల్లిపాయలు- ఆరు, ధనియాల పొడి- టీస్పూన్‌, జీలకర్ర పొడి- టీస్పూన్‌, ఉప్పు- తగినంత, కారం- సరిపడా, నువ్వులు, పల్లీల పేస్ట్‌- కప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- టీస్పూన్‌, తరిగిన పచ్చిమిర్చి- మూడు, చింతపండు గుజ్జు- రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు- టీస్పూన్‌, జీలకర్ర- టీస్పూన్‌, ఎండుమిర్చి- రెండు, పసుపు- చిటికెడు, కరివేపాకు- కొద్దిగా, కొత్తిమీర తురుము- కొద్దిగా, నూనె- మూడు టేబుల్‌ స్పూన్లు.

తయారీ: 

నువ్వులు, పల్లీలను వేయించి పొడి చేసుకోవాలి. స్టవ్‌ వెలిగించి కడాయిలో నూనె పోసి వేడిచేయాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత పసుపు, కారం, అల్లంవెల్లులి, కొంచెం ఉప్పు కలిపి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన నువ్వులు, పల్లీల మిశ్రమం, జీలకర్ర, ధనియాల పొడి, సరిపడా ఉప్పు, చింతపండు గుజ్జు వేసి కొన్ని నీళ్లు పోసి అన్నీ కలిసేట్టుగా బాగా కలపాలి. తర్వాత ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్రపొడి వేయాలి. తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి పదిహేను నిమిషాలపాటు తక్కువ మంట మీద ఉడకనివ్వాలి. దించిన తర్వాత కొత్తిమీర తురుము వేసుకోవాలి. ఈ కూర అన్నం, చపాతీల్లోకి ఎంతో బాగుంటుంది.




  1. #మసాలా కూర
  2. #వంకాయ కూర
  3. #మసాలా వంకాయ
  4. #శనగల కూర
  5. #గుత్తి వంకాయ కూర
  6. #గుత్తి వంకాయ కూర తయారీ విధానం
  7. #గుత్తొంకాయ్
  8. #గుత్తి వంకాయ కూర చేసే విధానం
  9. #మామూలు వంకాయ కూర
  10. #ఉల్లిపాయ కథ
  11. #ఉల్లిపాయ సాంగ్
  12. #ఉల్లిపాయ వలన ఉపయోగాలు
  13. #ఉల్లిపాయ టమోటా
  14. #ఉల్లిపాయంత ఊర్లో
  15. #ఉల్లి ఉపయోగాలు
  16. #ఉల్లిపాయంత ఊరు
  17. #ఉల్లిపాయంత ఊర్లో గుమ్మడికాయ

Comments