ఉల్లిపాయ పులుసు - Onion Curry
ఉల్లిపాయ పులుసు
కావాల్సినవి:
చిన్నముక్కలుగా కోసిన ఉల్లిపాయలు- నాలుగు, చింతపండు- నిమ్మకాయంత, పొడవుగా కోసిన పచ్చిమిర్చి- మూడు, ధనియాల పొడి- టేబుల్‌స్పూన్, వెల్లుల్లి రెబ్బలు- ఆరు, కరివేపాకు, కొత్తిమీర- కొద్దిగా, పసుపు- పావు టీస్పూన్, మెంతులు- టీస్పూన్, కారం- టేబుల్‌స్పూన్, నూనె- రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు- సరిపడా.తయారీ:
చింతపండును నీళ్లలో నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి వేడిచేయాలి. దీంట్లో మెంతులు, చిదిమిన వెల్లుల్లి వేసి ఇవి వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయి. తర్వాత మంట తగ్గించి మూత పెడితే త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు కరివేపాకు వేసి ఉల్లిపాయలను రంగు మారేంత వరకు వేయించాలి. తర్వాత పసుపు, కారం, చింతపండు పులుసు వేసి కలపాలి. పులుసు చిక్కగా ఉంటే కొన్ని నీళ్లు పోయాలి. దీంట్లో ధనియాల పొడి వేసి ఉప్పు, కారం సరిచూసుకోవాలి. ఇప్పుడు సన్నని మంట మీద పులుసును ఉడకనివ్వాలి. నూనె పక్కలకు వచ్చిందంటే ఉడికినట్టే. ఉల్లిపాయలను సన్నగా తరిగితే పులుసు చిక్కగా ఉంటుంది. చివరగా కొత్తిమీర తురుము వేసుకోవాలి.
#మసాలా కూర,
#వంకాయ కూర,
#మసాలా వంకాయ,
#శనగల కూర,
#గుత్తి వంకాయ కూర,
#గుత్తి వంకాయ కూర తయారీ విధానం,
#గుత్తొంకాయ్,
#గుత్తి వంకాయ కూర చేసే విధానం,
#మామూలు వంకాయ కూర,
#ఉల్లిపాయ కథ,
#ఉల్లిపాయ సాంగ్,
#ఉల్లిపాయ వలన ఉపయోగాలు,
#ఉల్లిపాయ టమోటా,
#ఉల్లిపాయంత ఊర్లో,
#ఉల్లి ఉపయోగాలు,
#ఉల్లిపాయంత ఊరు,
#ఉల్లిపాయంత ఊర్లో గుమ్మడికాయ,
Comments
Post a Comment