ఉల్లిపాయ - మినీ ఇరానీ సమోసా

ఉల్లిపాయ - మినీ ఇరానీ సమోసా

ఉల్లిపాయ - మినీ ఇరానీ సమోసా

కావాల్సినవి: 

మైదా- కప్పు, గోధుమపిండి- కప్పు, అటుకులు- కప్పు, ఉల్లిపాయ ముక్కలు- కప్పు, చిన్నముక్కలుగా కోసిన పచ్చిమిర్చి- మూడు, కొత్తిమీర- పావుకప్పు, కారం- అర టీస్పూన్‌, గరం మసాలా- పావు టీస్పూన్‌, చాట్‌మసాలా- పావు టీస్పూన్‌, వాము- పావు టీస్పూన్‌, ఉప్పు- తగినంత, నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ: 

గిన్నెలో మైదా, గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, నూనె, వాము వేసి బాగా కలపాలి. పిండిలో నూనె వేసుకుంటే సమోసాలు గుల్లగా వస్తాయి. దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, అటుకులు వేసి కలపాలి. దీంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, గరంమసాలా, చాట్‌మసాలా, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దను నాలుగు సమాన భాగాలుగా చేసుకుని పెద్ద చపాతీల్లా ఒత్తుకోవాలి. పైన మైదా పిండి చల్లుకుంటూ పలచగా ఒత్తుకోవాలి. స్టవ్‌ మీద పెనం పెట్టుకుని వేడెక్కిన తర్వాత చపాతీ వేసి రెండు వైపులా దోరగా కాల్చాలి. చాకుతో చపాతీకి అటు, ఇటు ఉండే చివర్లను కత్తిరించి చపాతీ చతురస్రాకారంలో ఉండేలా చేయాలి. ఇప్పుడు స్కేలు ఉపయోగించి దీన్ని మూడు సమాన భాగాలుగా కత్తిరించాలి. చిన్నగిన్నెలో కొద్దిగా మైదా వేసుకుని నీళ్లు పోసి పేస్టులా చేయాలి. కత్తిరించిన చపాతీ ముక్కను త్రికోణాకారంలో మడత పెట్టి అంచుల దగ్గర మైదా పేస్టు రాయాలి. మధ్యలో ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టి మడతపెట్టుకుని విడిపోకుండా మైదాతో అతికించాలి. ఇలా అన్ని సమోసాలను చేసుకున్న తర్వాత కడాయిలో నూనె పోసి వేడెక్కాక వేయించుకోవాలి. సమోసాలను రెండువైపులా తక్కువ మంట మీద వేయించాలి. మిగిలిన చపాతీ చివర్లను వృథాగా పారేయకుండా చిన్న ముక్కలుగా కోసుకుని వేయించుకోవచ్ఛు కాస్త కారంగా తినాలనుకుంటే.. పచ్చిమిర్చికి మధ్యలో గాటుపెట్టి నూనెలో వేయించాలి. వీటి మీద కాస్త ఉప్పు చల్లి సమోసాతో తింటే రుచి అదిరిపోతుంది.






  1. #మసాలా కూర,
  2. #వంకాయ కూర,
  3. #మసాలా వంకాయ,
  4. #శనగల కూర,
  5. #గుత్తి వంకాయ కూర,
  6. #గుత్తి వంకాయ కూర తయారీ విధానం,
  7. #గుత్తొంకాయ్,
  8. #గుత్తి వంకాయ కూర చేసే విధానం,
  9. #మామూలు వంకాయ కూర,
  10. #ఉల్లిపాయ కథ,
  11. #ఉల్లిపాయ సాంగ్,
  12. #ఉల్లిపాయ వలన ఉపయోగాలు,
  13. #ఉల్లిపాయ టమోటా,
  14. #ఉల్లిపాయంత ఊర్లో,
  15. #ఉల్లి ఉపయోగాలు,
  16. #ఉల్లిపాయంత ఊరు,
  17. #ఉల్లిపాయంత ఊర్లో గుమ్మడికాయ,

Comments

Popular posts from this blog

ఉల్లిపాయ మసాలా కూర - రుచుల ఉల్లి... పోషకాల తల్లి