ఉల్లిపాయ - ఉల్లిపొరక ఉక్కిరి
కావాల్సినవి:
ఉల్లిపొరకలు- రెండు కట్టలు, నూనె- రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర- అర టీస్పూన్, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- ఆరు, పసుపు- అర టీస్పూన్, అల్లంవెల్లుల్లి పేస్ట్- అర టీస్పూన్, ఉప్పు- తగినంత, కొత్తిమీర తురుము- టేబుల్ స్పూన్.
తయారీ:
ఉల్లిపొరకలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని చిన్నముక్కలుగా తరగాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి జీలకర్ర వేసి, అది చిటపటలాడాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఇందులో పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి. తర్వాత ఉల్లిపొరకలు, ఉప్పు వేసి మూతపెట్టి పది నిమిషాలపాటు మగ్గనివ్వాలి. వీటిల్లోనే నీరు ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా నీళ్లు పోయాల్సిన పని లేదు. నీరంతా ఇంకిపోయి కూర దగ్గరకు వచ్చిన తర్వాత దించి కొత్తిమీర తురుము వేయాలి. ఇష్టమైతే కొంచెం కారం కూడా వేసుకోవచ్ఛు ఈ వేపుడు అన్నం, చపాతీల్లోకి చాలా బాగుంటుంది.
- #మసాలా కూర,
- #వంకాయ కూర,
- #మసాలా వంకాయ,
- #శనగల కూర,
- #గుత్తి వంకాయ కూర,
- #గుత్తి వంకాయ కూర తయారీ విధానం,
- #గుత్తొంకాయ్,
- #గుత్తి వంకాయ కూర చేసే విధానం,
- #మామూలు వంకాయ కూర,
- #ఉల్లిపాయ కథ,
- #ఉల్లిపాయ సాంగ్,
- #ఉల్లిపాయ వలన ఉపయోగాలు,
- #ఉల్లిపాయ టమోటా,
- #ఉల్లిపాయంత ఊర్లో,
- #ఉల్లి ఉపయోగాలు,
- #ఉల్లిపాయంత ఊరు,
- #ఉల్లిపాయంత ఊర్లో గుమ్మడికాయ,
Comments
Post a Comment