ఉల్లిపాయ పచ్చడి - Onion Pachadi

ఉల్లిపాయ పచ్చడి

ఉల్లిపాయ పచ్చడి - Onion Pachadi

కావాల్సినవి: 

చిన్నముక్కలుగా కోసిన ఉల్లిపాయలు- రెండు, ఎండుమిర్చి- ఇరవై, చింతపండు- పెద్ద నిమ్మకాయంత, ధనియాలు- మూడు టీస్పూన్లు, మెంతులు- అర టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు- పది, ఆవాలు- అర టీస్పూన్‌, మినప్పప్పు- టీస్పూన్‌, పసుపు- పావు టీస్పూన్‌, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత, నూనె- మూడు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు రెబ్బ- ఒకటి, కొత్తిమీర- కొదిగా.

తయారీ: 

స్టవ్‌ వెలిగించి కడాయిలో కొద్దిగా నూనె పోసి వేడిచేయాలి. ఎండుమిర్చి, మెంతులు, ధనియాలు వేసి తక్కువ మంట మీద దోరగా వేయించాలి. వీటిని పక్కకు తీసి చల్లారబెట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా నూనె పోసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. చిటికెడు ఉప్పు వేస్తే ఉల్లిపాయల్లోని నీరు బయటకు వచ్చి త్వరగా వేగుతాయి. ఇప్పుడు నానబెట్టిన చింతపండును నీటితోపాటుగా వేసి ఉడకనివ్వాలి. వేయించిన ఎండుమిర్చిని మిక్సీ పట్టి పొడిచేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఉడికి మిశ్రమం దగ్గరకు వచ్చిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, ఎండుమిర్చి పొడి వేయాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి తక్కువ మంట మీద నూనె పైకి తేలేంతవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దీంట్లో నీళ్లు కలపకూడదు. చివరగా కడాయిలో నూనె పోసి వేడెక్కాక తాలింపు దినుసులన్నీ వేసి వేయించాలి. ఇందులో పచ్చడి వేసి రెండు, మూడు నిమిషాల పాటు ఉడికించాలి. నూనె కొంచెం ఎక్కువగా వేస్తే వారం రోజులపాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని ఒక్కరోజు కోసం చేసుకుంటే నూనె తక్కువగా వేసుకోవచ్ఛు ఇది అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోసెల్లోకి కూడా బాగుంటుంది.




#మసాలా కూర,
#వంకాయ కూర,
#మసాలా వంకాయ,
#శనగల కూర,
#గుత్తి వంకాయ కూర,
#గుత్తి వంకాయ కూర తయారీ విధానం,
#గుత్తొంకాయ్,
#గుత్తి వంకాయ కూర చేసే విధానం,
#మామూలు వంకాయ కూర,
#ఉల్లిపాయ కథ,
#ఉల్లిపాయ సాంగ్,
#ఉల్లిపాయ వలన ఉపయోగాలు,
#ఉల్లిపాయ టమోటా,
#ఉల్లిపాయంత ఊర్లో,
#ఉల్లి ఉపయోగాలు,
#ఉల్లిపాయంత ఊరు,
#ఉల్లిపాయంత ఊర్లో గుమ్మడికాయ,

Comments

Popular posts from this blog

ఉల్లిపాయ మసాలా కూర - రుచుల ఉల్లి... పోషకాల తల్లి